తెలుగులో మాట్లాడిన అమితాబ్, అమీర్...సినిమా కోసమే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగులో మాట్లాడిన అమితాబ్, అమీర్…సినిమా కోసమే..

September 26, 2018

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కాంబినేషలో వస్తున్న చిత్రం ’థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’. ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి  ‘ధూమ్ 3’ఫేం కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కన్ఫెషన్స్ ఆఫ్ థగ్స్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫలింస్ సంస్ధ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.Aamir and Amitab speak in Tamil and Telugu to pramote 'Thugs of Hindustan'ప్రస్తుతం ఈచిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని పలు బాషాల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయనున్నారు. ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్, అమీర్ స్వయంగా తెలుగులో మాట్లాడారు. దీవావళి రోజున ఈ చిత్రం విడుదల అవుతోందని చెప్పారు. నవంబర్ 8న ‘థగ్స్ ఆప్ హిందూస్తాన్’ ప్రేక్షకులను అలరించనుంది.