Aamir Khan hoisted the national flag on the house
mictv telugu

అమీర్ ఖాన్ ఇంటిపై ఎగిరిన త్రివర్ణ పతాకం.. వైఫల్యమే కారణమా?

August 13, 2022

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి భారీ ఎత్తున శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దేశ పౌరులు తమ ఇళ్లపై శనివారం (ఆగస్టు 13) నుంచి సోమవారం (ఆగస్టు 15) వరకు జాతీయ జెండా ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి భారీ ఎత్తున స్పందన రాగా, ఒకరోజు ముందుగానే బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ తన ఇంటిపై జెండాను ఎగురవేశారు. జెండా పక్కన నిలబడి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా, ఆయన నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది. గత పదమూడేళ్లలో ఇదే తక్కువ కలెక్షన్లు కావడం గమనార్హం. గతంలో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాడని, అందుకు సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. దీనికి స్పందించిన అమీర్.. క్షమాపణలు చెప్పినా ఓ వర్గం నెటిజన్లు అందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ జెండాను తన ఇంటిపై ఎగురవేసి తద్వారా జెండా ఎగురవేసిన తొలి బాలీవుడ్ హీరోగా నిలిచారు.