Aamir Khan On Boycott Laal Singh Chaddha Trend If I Hurt Anyone, I Regret It 
mictv telugu

ఎవరినీ బాధపెట్టాలనుకోలేదు.. అమీర్ ఖాన్ వేడుకోలు

August 10, 2022

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరపైకి వచ్చిన ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ గతంలో దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అమీర్ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు సినిమాకు శాపంగా మారాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జనాలు డిమాండ్ చేస్తున్నారు. ఆమిర్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. తన సినిమాలను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు కోరారు. అయినప్పటికీ ట్రోలింగ్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో అమీర్ మరోసారి మీడియా ముఖంగా స్పందించారు.

తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి క్షమించాలని ఆమిర్ కోరారు. తాను ఎవరినీ నొప్పించాలని అనుకోలేదని చెప్పారు. తన సినిమాను ఎవరైనా చూడొద్దని అనుకుంటే… వారి సెంటిమెంట్ ను కూడా తాను గౌరవిస్తానని అన్నారు. ఆగష్టు 11న పలు భాషల్లో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కరీనా కపూర్, మోనా సింగ్, అక్కినేని నాగచైతన్య తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ కు చెందిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. అద్వైత్ చందన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.