నటించడం ఆపను.. ఆమిర్ ఖాన్ - MicTv.in - Telugu News
mictv telugu

నటించడం ఆపను.. ఆమిర్ ఖాన్

March 17, 2019

నటులకు రిటైర్మెంట్ వుంటుందా అంటే వుండదనే చెప్పాలి. నటిస్తూ వుండాలి కానీ బతికినన్ని రోజులు వయసుకు తగ్గ పాత్రలతో నటించవచ్చు. వాళ్లకు రిటైర్మెంటు వుండదు. ఆ విషయాన్నే చెప్పాడు బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్.

ఇటీవల ఆమిర్ 54వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆమిర్‌ తన తదుపరి సినిమాల గురించి, రిటైర్మెంట్‌ గురించి మీడియాతో పంచుకున్నారు.

Aamir Khan reveals his plans to retire from acting.

‘నేను నటుడిగా రాణిస్తున్నాను కానీ, నాకు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. అలా నేను ‘తారే జమీన్’ సినిమాతో దర్శకుడిగా మారాను. ఓ నటుడిగా నా ప్రయాణం ఇప్పుడే మొదలైనట్లు అనిపిస్తోంది. నేను పూర్తిస్థాయి దర్శకుడిని అయ్యాక నటనకు గుడ్‌బై చెప్తాను. ఇప్పటికైతే సినిమాల్లో నటించడం ఆపను. నటుడిగా బిజీగా వుండటం వల్ల పూర్తిస్థాయి దర్శకుడిగా రాణించలేకపోతున్నా’ అని తెలిపారు ఆమిర్. త్వరలో ఆమిర్ హాలీవుడ్‌ క్లాసిక్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే సినిమా రీమేక్‌లో నటించబోతున్నారు. ఈ సినిమాకు ‘లాల్‌‌సింగ్‌ చద్దా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.