ఆమిర్ ఖాన్ ఇంట్లో కరోనా.. తల్లికి రావొద్దని ప్రార్థన  - MicTv.in - Telugu News
mictv telugu

ఆమిర్ ఖాన్ ఇంట్లో కరోనా.. తల్లికి రావొద్దని ప్రార్థన 

June 30, 2020

Aamir Khan Staff Tested Corona Positive

ప్రపంచాన్ని కరోనా భూతం ఇంకా వదిలి వెళ్లడం లేదు. ఎవరికి ఎప్పుడు.. ఎలా వ్యాపిస్తుందో తెలియక జనం వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా ప్రముఖుల ఇళ్లకు కూడా దీని తాకిడి ప్రారంభమైంది. శానిటైజర్లు, వ్యక్తిగత శుభ్రత పాటించినా  అడ్డుకుట్ట పడం లేదు. బాలీవుడ్‌లోనూ కొన్ని రోజులుగా ఈ వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఇంటిలో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అతని ఇంట్లో పని చేసే సిబ్బందికి పాజిటివ్ అని తేలింది. దీంతో అతని కుటుంబం మొత్తం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమిర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 

సిబ్బందికి కరోనా అని తేలడంతో తమ కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారని తెలిపారు. అందరి ఫలితాల్లో నెగిటివ్ అని వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఇంకా తన తల్లి రిపోర్టు రావాల్సి ఉండగా.. ఆమెకు కూడా నెగిటివ్ రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా తమకు సాయం అందించిన మున్సిపల్ సిబ్బంది, కోకిలా బెన్ ఆస్పత్రి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ముందు జాగ్రత్తగా వారంతా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో కరోనా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.