కొరటాల శివతో ఎన్టీఆర్ 30 మూవీ ముగియగానే కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి పాన్-ఇండియా చిత్రం చేయబోతున్నాడు ఎన్టీఆర్. NTR 31గా ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా అవతరించిన ఎన్టీఆర్ కి నార్త్ బెల్ట్ లోను మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి తరుణంలో ఇండియన్ నంబర్ వన్ కమర్షియల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ అంటే ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ హీరోగా మరింత మార్కెట్ పెంచుకున్నట్టే. కేజిఎఫ్2 చిత్రానికి మూడు రేట్లు అధిక బడ్జెట్ తో ఎన్టీఆర్31 తీయబోతున్నారని.. ఇందులో ఎన్టీఆర్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ నటించబోతున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఎందుకో ఈ ప్రాజెక్టు ని నుండి సంజయ్ తప్పుకున్నాడట. కేజిఎఫ్2లో విలన్ గా నటించిన సంజయ్.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోవడానికి ప్రధాన కారణం అమీర్ ఖాన్ అని తెలుస్తుంది.
ఎన్టీఆర్ 31 కథ మొత్తం విన్నాకా.. ‘ఇది నెక్స్ట్ లెవెల్ స్టోరీ అని.. దీనికి విలన్ పాత్రలో తానూ న్యాయం చేయలేనని.. సల్మాన్, అమీర్ స్థాయి ఉన్న హీరోలైతే సరిపోతారని’ తప్పుకున్నాడట సంజయ్ దత్. అయితే సంజయ్ రిఫరెన్స్ తో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కథ విని అబ్బురపోయాడట. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఎన్టీఆర్ కి విలన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ వార్తను విపరీతంగా స్ప్రెడ్ చేయడంతో వైరల్గా మారింది. నిజానికి ఇప్పటి వరకు ఎవరు కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఈ రూమర్ విన్న ప్రశాంత్ నీల్, అమీర్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఈ పాత్రపై చిన్న లీకులు కూడా వస్తున్నాయి. 1990లో అరబ్ దేశాల నుండి భారత ప్రభుత్వాన్ని గడగడలాడించిన మాఫియా డాన్ పాత్రలో అమీర్ ఖాన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ ఆధారంగానే ఎన్టీఆర్ 31 కూడా తెరక్కనున్నట్టు రూమర్స్ వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
మిస్ యూనివర్స్ పోటీకి దివితా రాయ్..
రెడ్లా.. రాజులా.. శెట్టిలా.. ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ?