Aamir Khan waived remuneration
mictv telugu

లాల్ సింగ్ చద్దా నష్టాన్ని భరించనున్న అమీర్ ఖాన్.. ఎంతంటే..

September 1, 2022

బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ తాజాగా నటించి నిర్మించిన చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లు సాధించి తీవ్రంగా నష్టపరిచింది. సినిమా వల్ల కలిగిన నష్టాన్ని అమీర్ ఖాన్ తన భుజాలపై వేసుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ రూ. 180 కోట్లు కాగా, ఈ చిత్రం కోసం అమీర్ ఖాన్ గత నాలుగేళ్లుగా మరే చిత్రాన్ని అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో విపరీతమైన నష్టం రావడంతో అమీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యునరేషన్‌ రూ. 50 కోట్లను వదులుకొని నిర్మాతకు ఆర్ధికంగా మద్ధతుగా నిలవాలనుకున్నారు. దీంతో మొత్తం భారం రూ. వంద కోట్లకు చేరిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లు మాత్రమే వసూలు చేసింది. గత పదేళ్లలో అమీర్ ఖాన్ సినిమా వంద కోట్లకు తక్కువ కలెక్షన్లు సాధించడం ఇదే తొలిసారి. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దాలో ప్రముఖ తెలుగు యువ నటుడు నాగ చైతన్య కీలక పాత్రలో నటించారు.