సినిమా షూటింగులకు రైలు పట్టాలు, రైల్వే స్టేషన్లు, రైల్వే ఆస్తులను అద్దెకిస్తున్న ఆ శాఖ.. షూటింగ్ నిర్మాతల నుంచి భారీగా ఆదాయం పొందుతోంది. ఈ విధంగా గతేడాది రూ. 2.48 కోట్లను ఆర్జించింది. ఇందులో ఒక్క అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు మాత్రమే రూ. 1.27 కోట్లు చెల్లించడం విశేషం. ఇంత మొత్తం చెల్లించి ఆమె తన తాజా సినిమా షూటింగును నిర్వహించింది. సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాని ఈ సినిమాకు ‘2 పెళ్లి కూతురు’, ‘లపాట లడ్కీ’ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. మొత్తం 50 రోజులు ఈ చిత్రం కోసం షూటింగ్ నిర్వహించగా, అందులో దాదాపు 24 రోజులు రైల్వే స్టేషన్లలో చిత్రీకరించారు. అంటే సినిమా కథ రైలు లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే ప్రేక్షకులు అంచనాకు వచ్చారు. కాగా, ఇంతకు ముందు కిరణ్ రావుకు ధోబీఘాట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ప్రస్తుతం అమీర్, కిరణ్ రావులు విడిపోయిన విషయం తెలిసిందే.