ఆప్ ఎమ్మెల్యే వీడియో : నామినేషన్‌కు స్కూటరు, గెలిచిన తర్వాత ఇలా - MicTv.in - Telugu News
mictv telugu

ఆప్ ఎమ్మెల్యే వీడియో : నామినేషన్‌కు స్కూటరు, గెలిచిన తర్వాత ఇలా

May 4, 2022

ప్రస్తుత కాలంలో ఎమ్మెల్యేల జీవన శైలి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల ముందు ప్రజల ముందు ఒకలా, గెలిచిన తర్వాత ఒకలా ఉంటారు. కానీ, పంజాబులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎమ్మెల్యే వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ వేసేందుకు స్కూటరుపై వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అత్యంత ఖరీదైన కారులో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నెలలు కూడా గడవకుండానే ఇంత సంపాదనా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. లూథియానాకు చెందిన ఆప్ పార్టీ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి ప్రభుత్వ కార్యాలయానికి అత్యంత ఖరీదైన పోర్షే కారులో వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సామాన్యుల పార్టీ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతలా మారిపోయారేంటి? అని ప్రశ్నిస్తున్నారు.