పంజాబ్‌లో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాల్లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ముఖ్యమంత్రి చరణ్ జీత్ చన్నీ ఓడిపోవడం. బదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చన్నీ ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ఉగోక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో లాభ్ సింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఆయన తల్లి బల్దేవ్ కౌర్ ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. కొడుకు ముఖ్యమంత్రిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తాను స్వీపర్‌గానే పని చేస్తానని బల్దేవ్ కౌర్ తెలిపింది. ఆప్ పార్టీ గుర్తు చీపురు కట్టేనని, తన చేతిలో ఉండేది కూడా చీపురేనని ఛలోక్తులు విసిరింది. సీఎంపై పోటీ చేస్తున్నా తన కుమారుడు తప్పక గెలుస్తాడని భావించానన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. లాభ్ సింగ్ తమ పాఠశాలలోనే చదివాడని వెల్లడించారు. కొడుకు ఎమ్మెల్యేగా గెలిచి అంత పేరు సంపాదించినప్పటికీ తల్లి మాత్రం స్వీపర్‌గానే కొనసాగాలనుకుంటోందని ప్రిన్సిపాల్ తెలిపారు.