పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే రూ. కోటి ఇస్తాం..  - MicTv.in - Telugu News
mictv telugu

పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే రూ. కోటి ఇస్తాం.. 

February 4, 2020

Aap party.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ విమర్శలే కాకుండా హామీలు కూడా జోరందుకుంటున్నాయి. అధికార  ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేలా తాయిలాల వర్షం కురిపించింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని ధనిక కుటుంబంలా మార్చడమే మేనిఫెస్టో ఉద్దేశమని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. 

హామీలు ఇవీ.. 

1.పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చనిపోతే వారి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం(మాన్యువల్ స్కావెంజిగ్ నిర్మూలన కోసం ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఖర్చుతో యంత్రాలు తీసుకొచ్చింది. 

2.అందరికీ నాణ్యమైన వైద్యం, విద్య, మంచినీరు, 24 గంటల విద్యుత్‌ సరఫరా

  1. ప్రజల ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు, 24 గంటల మార్కెట్లు 
  2. 10 లక్షల మంది వృద్ధులకు ఉచిత తీర్థయాత్రలు