పంజాబ్ ఆప్ మినిస్టర్ హర్ జోత్ సింగ్, సీనియర్ పోలీస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్ లు త్వరలో ఒక్కటవ్వబోతున్నారు. ఈ నెలఖారుకు వీళ్లిద్దరూ పెళ్ళిచేసుకోనున్నారు అని పంజాబ్ స్పీకర్ కుల్టర్ సింగ్ అనౌన్స్ చేశారు. వాళ్ళిద్దరికీ కంట్రాట్స్ చెప్పారు.
ఆప్ ఎమ్మెల్యే హర్ జోత్ సింగ్ ప్రస్తుతం పంజాబ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ 32 ఏళ్ళ మంత్రి ఎల్ఎల్బీ చేసి కొన్నాళ్ళు అడ్వొకేట్ గా కూడా పనిచేశారు. 2017లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హరజోత్ మొదట్లో ఆప్ యూత్ వింగ్ లీడర్ గా కూడా పనిచేశారు. ఇక జ్యోతి యాదవ్ పంజాబ్ కేడర్ లోని ఐపీఎస్ ఆఫీసర్. ప్రస్తుతం మానస జిల్లా సూపరెండెంట్ పోలీసాఫీసర్ గా పనిచేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యే రాజిందర్ పాల్ కౌర్ తో జరిగిన వాదనతో జ్యోతి అక్కడ ఫేమస్ అయ్యారు.
హర్ జోత్, జ్యోతికి ఇంతకు ముందే ఎంగేజ్ మెంట్ అయింది. ఈ నెల చివర్లో వీళ్లిద్దరూ పెళ్ళిద్వారా ఒక్కటవుతున్నారు.