మూడు వాయిదాల తర్వాత జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్ధి షెల్లీ ఒబెరాయ్ బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో గెలిచారు. ఆప్‌కి 150 ఓట్లు రాగా, బీజేపీకి 116 వచ్చాయి. గతేడాది మున్సిపల్ ఎన్నికలు జరగ్గా ఆప్ 134 స్థానాల్లో విజయం సాధించి మెజారిటీ తెచ్చుకుంది. కానీ రెండు నెలలు గడచినా మేయర్ ఎన్నిక జరక్కపోవడంతో చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో బుధవారం ఎన్నిక నిర్వహించారు.
అటు నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ అవకాశం కల్పిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, 2013లో ఆప్ పార్టీలో చేరిన షెల్లీ ఒబెరాయ్.. ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఫిలాసఫీలో డాక్టరేట్ పట్టా సంపాదించారు. ఢిల్లీ ఆప్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. దీంతో పాటు మేయర్ ఎన్నికను సకాలంలో జరపాలని సుప్రీంకోర్టను ఆశ్రయించి విజయం సాధించారు.