గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో బుల్డోజర్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడి మున్సిపల్ కార్పోరేషన్లలోని అక్రమ కట్టడాలను బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం అగ్నేయ ఢిల్లీలోని మదన్‌పూర్ ఖాదర్ ప్రాంతంలో కూల్చివేతలను ఆపడానికి ప్రయత్నించిన ఆ ప్రాంతానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆప్.. బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తాకు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుప్తా తన ఇంటిని, కార్యాలయాన్ని నిర్మించారని, శనివారం ఉదయం 11 గంటలలోగా ఆ ఆక్రమణలను తొలగించాలని ఆప్ డిమాండ్ చేసింది. లేకపోతే ఆయన ఇల్లు, ఆఫీస్‌కు బుల్డోజర్లతో వెళ్తామని హెచ్చరించింది.