వచ్చే ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్‌దే.. ఆరా పోల్ సర్వే
తెలంగాణలోని అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రీ పోల్స్ ఫలితాలు వచ్చేస్తున్నాయి. ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవానే పునరావృతమవుతుందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరా పోల్ స్ట్రాటసీజ్ సంస్థ అంచనా వేసింది. రెండోస్థానంలో బీజేపీ, మూడో స్థానంలో కాంగ్రెస్ ఉంటాయని వెల్లడించింది.
పోల్ ఫలితాల ప్రకారం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఆత్యధిక శాతం ఓట్లు దక్కుతాయి. గులాబీ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్లు 8 శాతం తగ్గి 38.88 శాతం వస్తాయి. బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయి. 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి దాదాపు 7 శాతం ఓట్లు వచ్చాయి.గత ఎన్నికల్లో 28 శాతం సాధించుకున్న కాంగ్రెస్ ఈసారి 23.71 శాతానికే పరిమితం కానుంది. ఇతరులకు 6.93 శాతం ఓట్లు దక్కొచ్చు. ఆంధ్ర సెటిలర్స్ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఉత్తర భారతీయుల్లో 80 శాతం బీజేపీవైపు నిలుస్తున్నారని ఆరా అంచనా.