ఆయేషా కేసు విచారణ మళ్లీ శురూ..! అసలు దోషులు దొరకునా? - MicTv.in - Telugu News
mictv telugu

ఆయేషా కేసు విచారణ మళ్లీ శురూ..! అసలు దోషులు దొరకునా?

August 5, 2017

నిజం అన్వేషణలో మళ్లీ విచారణ.ఆయేషాను హత్యచేసిన నిందితులు ఇప్పటికైనా దొరుకుతారా?విజయవాడలోని ఓ హాస్టల్ లో పది సంవత్సరాల క్రితం ఆయేషా మీరా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.ఆ కేసులో సత్యంబాబు అనే వ్యక్తిని నిందితుడిగా పరిగణించి అరెస్ట్ చేసారు..అప్పట్లో కోర్డు సత్యం బాబుకు జీవిత ఖైదు విధించింది.సత్యంబాబు హైకోర్టును ఆశ్రయించగా..ఏడు సంవత్సరాల తర్వాత సత్యం బాబు నిర్ధోషని హైకోర్టు తీర్పునిచ్చింది.

అయితే ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో పోలీసుల అలక్ష్యాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. పునర్విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణకు డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదించడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీఐజీ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ ఆనురాధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిట్‌ దర్యాప్తును విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించనున్నారు. మరి ఇప్పటికైనా ఆయేషా కేసులో ఉన్న మిస్టరీ వీడుతుందా?అసలు దోషులెవరో బైటపడతారా?ఏమో మరి సూడాలె.