ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన.. మళ్లీ వస్తున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఏబీ డివిలియర్స్ సంచలన ప్రకటన.. మళ్లీ వస్తున్నా..

May 25, 2022

ఏబీ డివిలియర్స్ అంటే తెలియని క్రికెట్ ప్రియులు ఉండరు. బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగిన ఆయన.. గత సంవత్సరంలో టీ20 లీగ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏబీ డివిలియర్స్ ఓ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది 2023 ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌ల్లో మళ్లీ ఆడుతానని ప్రకటించాడు. “నేను తిరిగి టీ20 లీగ్‌కు వస్తానన్న విషయాన్ని స్నేహితుడు విరాట్ ముందే నిర్థారించినందుకు సంతోషం. నిజం చెప్పాలంటే ఈ విషయంపై ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు. కానీ, కచ్చితంగా వచ్చే ఏడాది టీ20 లీగ్‌లో కనిపిస్తానని నేను నమ్ముతున్నా. ఏ పాత్రలో అనేది ఇంకా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది బెంగళూరులోనూ కొన్ని టీ20 లీగ్ మ్యాచ్‌లు ఉంటాయని తెలిసింది. నా రెండోవ సొంతగడ్డకు రావడానికి తహతహలాడుతున్నా. కిక్కిరిసిన చిన్నస్వామి స్టేడియాన్ని మళ్లీ చూడాలని ఉంది” అని ఆయన అన్నారు.

ఏబీ డివిలియర్స్.. గతంలో బెంగళూరు తరఫున 30.71 సగటుతో 5,162 పరుగులు చేశాడు. 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొదట్లో డివిలియర్స్ కెరీర్ కూడా సాదాసీదాగానే ఆరంభమైంది. తొలి టెస్టులోనే ఓపెనర్‌గా దిగిన అతను పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా రోజుల వరకు అందరిలో ఒకడిగానే ఉండిపోయాడు. జట్టు అవసరం కొద్దీ ఒకటో నంబర్‌ నుంచి ఎనిమిదో స్థానం వరకు అతను బ్యాటింగ్‌కు దిగాడు. 2008లో అహమ్మ దాబాద్‌లో భారత్‌పై డబుల్ సెంచరీ చేసిన తర్వాతే అతనికి టెస్టు క్రికెటర్‌గా గుర్తింపు దక్కింది. అప్పటినుంచి గత సంవత్సరం వరకు రికార్డులు బ్రేక్ చేస్తూ, విధ్వంసక బ్యాట్‌మెన్‌గా పేరుగాంచాడు.