AB Venkateswara Rao, senior IPS officer, responded on the suspension by the Jagan government
mictv telugu

కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సస్పెన్షన్‌పై ఏబీ రియాక్షన్

June 29, 2022

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర రావును ఏపీ ప్రభుత్వం మరోసారి స‌స్పెండ్ చేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించి వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ నిన్న(మంగ‌ళ‌వారం) సస్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసిశారు. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఇంటెలిజెన్స్ అద‌న‌పు డీజీపీగా ప‌ని చేసిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు.. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గ‌తేడాది మార్చిలో పై క్రిమిన‌ల్ కేసు న‌మోదైంది. ఆ సమయంలో సర్వీస్ నిబంధలను ఉల్లంఘించారనే అభియోగాలతో జగన్ సర్కారు సస్పెండ్ చేసింది.

ప్రభుత్వ చర్యను తప్పుబడుతూ ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు.. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఇటీవ‌లే తిరిగి జూన్ 15 న రాష్ట్ర ప్ర‌భుత్వ విధుల్లో చేరారు. ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ విభాగం అద‌న‌పు డీజీగా నియ‌మితుల‌య్యారు. సరిగ్గా 15 రోజులైన కాకముందే మళ్లీ సస్పెండ్ అయ్యారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఆర్డర్‌లో చెప్పారని, మార్చి 2021లో తనపై కేసు పెట్టారని చెబుతున్నారు.. కేసు ట్రైల్ లేకుండా సాక్షిని ఎలా బెదిరిస్తారని ఏబీ ప్రశ్నించారు. 3-1కింద ఇచ్చిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిందని, మళ్లీ 3-3కింద ఎలా సస్పెన్షన్ చేస్తారని ఆయన నిలదీశారు. అది చట్ట విరుద్దమన్నారు. తనపై ఛార్జిషీట్ లేదని, తానెందుకు భయపడాలన్నారు. ఏబీసీ అధికారులు చెప్పినవన్నీ అబద్దాలేనని, అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. రూపాయి అవినీతి జరగని దగ్గర.. అవినీతి కేసు ఏంటని ప్రశ్నించారు.

కొంత మంది వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్‌ చేస్తున్నాయి. నాపై ఎన్నో ఫిర్యాదులు, పిటిషన్లు.. మూడేళ్లలో నేను తప్పు చేసినట్లు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లేదు. మూడేళ్లైనా ఇంతవరకు నేను చేసిన తప్పేంటో చెప్పలేకపోయారు. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం తప్పదు.. ఇంకా పోరాడతా’’ అని ఏబీవీ వెల్లడించారు.