డ్రగ్స్ కేసులో ‘ఏబీసీడీ’ నటుడు అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో ‘ఏబీసీడీ’ నటుడు అరెస్ట్

September 20, 2020

n vbhn

కన్నడ చిత్రసీమలో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్లు సంజన గర్లాని, రాగిణి ద్వివేదిలు అరెస్ట్ అయ్యారు. తాజాగా పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో నటుడు, కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి కూడా ఉన్నాడు. వీరిద్దరూ మాదకద్రవ్యమైన ‘ఎండీఎంఏ’ను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్ తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్‌తో బైక్‌పై వెళుతూ పట్టుబడ్డారని, రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్‌గా గుర్తించామని తెలిపారు. 

వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్ తో పాటు బైక్, రెండు ఫోన్లు సీజ్ చేశామన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ చట్టం కింద వీరిపై కేసును నమోదు చేశామని వికాస్ కుమార్ వెల్లడించారు. అమన్ శెట్టి ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బాలీవుడ్ వచ్చిన ‘ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్’ సినిమాలో నటించాడు.