కలాం సాబ్ నీకు సలాం..!
ఆయన జీవితమే ఒక స్పూర్తి,చిన్నప్పుడు చదువు ఆపవలసిన పరిస్థితిలో ఇంటింటికి పేపర్ వేస్తూ తన చదువును కొనసాగించిన గొప్ప సంకల్పం కలవాడు, వ్యక్తి గత సంతోషానికి వివాహం, మిద్దెలు, మేడలు అనే ఆలో చనలు లేకుండా నిరంతరం దేశ సేవలో తరించిన కర్మ యోగి. భారతదేశపు మేలి రత్నం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగారి 2వ వర్ధంతి నేడు,ఆయన 2వ వర్ధంతి వేడుకలు తమిళనాడు రామేశ్వరంలోని పెయి కరుంబులో జరిగాయి.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పెయి కరుంబులో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కలాం స్మృతి కేంద్రాన్ని డీఆర్‌డీవోను ఏర్పాటు చేశారు. కలాం సమాధిని దర్శించుకుని ఘనంగా నివాళి అర్పించారు మోడీ.కలాం స్మారక కేంద్రంలో కట్టడాల్ని పరిశీలించారు.చాచా నెహ్రూ తర్వాత బాలల హృదయాలు జయించినది ఒక్క అబ్దుల్ కలాంగారే. వారు జీవితమంతా శాస్త్ర వేత్త అయినా ఉపాధ్యాయ ప్రవృత్తి అవకాశం దొరికి నప్పుడల్లా విద్యార్థులను ఉత్తేజపరిచేవారు.రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత ఆఖరి శ్వాస వరకూ బాలలకే అంకితమైన మహామనిషి అబ్దుల్ కలాం గారు,కోట్ల మంది విధ్యార్థులకు స్పూర్తి అయ్యారు,దేశ సేవకోసం,విద్యార్థులను చైతన్య పరచడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కలాం గారికి సలాం.