ఎమ్మార్వోపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండగుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మార్వోపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన దుండగుడు

November 4, 2019

Abdullapurmet MRO Vijaya.

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అబ్ధుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయా రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. డ్యూటీలో ఉన్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఘటన స్థలంలోనే ఆమె పూర్తిగా కాలిపోయి మరణించింది.

వెంటనే మిగిలిన పెట్రోల్ తనపై పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎమ్మార్వోను కాపాడబోయిన ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. భోజన విరామం సమయంలో జనం లేనిది చూసి దుండగుడు ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే అతడు ఎందుకు ఇలా చేశాడనే వివరాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.