దళపతి విజయ్ నటిస్తున్న లియో చిత్రంలో అభిరామి కూడా నటిస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ నటి వేయించుకున్న వాటి మీద ఇండస్ట్రీలోనే కాదు.. అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. తమిళ బిగ్ బాస్ 3తో అభిరామి ఫేమస్ అయింది. అక్కడితో ఆమె కెరీర్ కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు తమిళ స్టార్, దళపతి విజయ్ సినిమా లియోలోనూ కనిపించనుంది. దీని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కాశ్మీర్ సెట్స్ లో దిగిన ఫోటోలు వార్తల్లో నిలిచాయి. అక్కడితో ఆమె ఫోటోల పరంపర ఆగలేదు. మహాశివరాత్రి నాడు ఈ 31 యేండ్ల సుందరి కాశ్మీర్ దగ్గరలోని ఒక శివాలయం ముందు డ్యాన్స్ తో సందడి చేసింది. ఆ వీడియో తెగ వైరల్ అయింది.
టాటూల గోల..
మామూలుగా టాటూలు వేయించుకోవడం అభిరామికి కొత్తేం కాదు. అంతకుముందు మెడ మీద నక్షత్రాలను టాటూ వేయించుకుంది. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన కుక్క పాదాల గుర్తుగా తన కుడి కాలిమీద ముద్రలు ఉంటాయి. వాటిని చూసి ఆమె ప్రేమను మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తాను తన వీపు మీద నటరాజ విగ్రహం టాటూ వేయించుకొని ఆ ఫోటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆమె అక్కడితో ఆగలేదు. దానికి క్యాప్షన్ గా.. ‘నాకు భక్తి గురించి ఎవరూ పాఠాలు చెప్పాల్సిన పని లేదు. నేను ఆరాధించే శివుడిని ఎక్కడ ఉంచాలన్నది నా వ్యక్తిగత విషయం’ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు.. చేతికి కింది భాగంలో పాము టాటూ వేయించుకుంది. దీంతో అసలు అభిరామికి ఏమైందని అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మోడల్ నుంచి నటిగా మారింది అభిరామి. మంచి ప్రాజెక్ట్ లు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి. లియోతో పాటు… ‘ఇరు ధువమ్ 2’ వెబ్ సిరీస్ లోనూ ఈ భామ కనిపించనుంది. ఇది త్వరలోనే సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం కానుంది.