రొమాంటిక్ సీన్లలో అందుకే నటించను.. అభిషేక్ - MicTv.in - Telugu News
mictv telugu

రొమాంటిక్ సీన్లలో అందుకే నటించను.. అభిషేక్

June 28, 2020

 

nvgnbvgnb

కొందరు హీరోయిన్లు సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అంగాంగ ప్రదర్శన చేస్తేనే సక్సెస్ అవుతామనే కొందరికి.. ఏమీ చూపించకుండానే సక్సెస్ అయి చూపించిన హీరోయిన్లు ఎందరో. ఇక హీరోల విషయానికి వస్తే ఆ హద్దులు ఏమీ లేవు కాబట్టి షర్టు లేకుండా నటించినా అడిగేవాడు లేడు. ఇప్పుడున్న సిక్స్ ప్యాక్ ట్రెండ్‌లో తమ జిమ్ బాడీని చూపిస్తున్నారు హీరోలు. కానీ, కొందరు హీరోలు ఏమీ చూపించకుండానే తమ స్థానాన్ని పదిలపరుచుకున్నారు. సినిమాకు కావాల్సింది గ్లామర్ కాదని టాలెంట్ అని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగులో మహేశ్ బాబు, నాని వంటి హీరోలు ముందుంటారు. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సైతం ఇప్పుడు ఆ దారిలోకి వచ్చాడు. తండ్రి అయ్యాక సినిమాల ఎంపిక‌లో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. 

సినిమాలు ఒప్పుకునే ముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కొన్ని కండిష‌న్స్ విధిస్తున్నట్టు అభిసేకే వెల్లడించాడు. అత‌డు తొలిసారిగా న‌టించిన వెబ్ సిరీస్‌ ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ విడుద‌ల‌ సంద‌ర్భంగా మీడియాతో అభిషేక్ మాట్లాడాడు. ‘రొమాంటిక్‌ స‌న్నివేశా‌ల్లో న‌టించడానికి నేను ఇబ్బంది ప‌డుతున్నాను. ఎందుకంటే అలాంటి సీన్ల‌లో న‌న్ను చూసేందుకు నా కూతురు ఇబ్బందిప‌డ‌టం ఇష్టం లేదు. నా కుమార్తె ఆరాధ్య పుట్టాక నాలో ఎంతో మార్పు వచ్చింది. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నా కూతురు అడిగే ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌లేను. కాబ‌ట్టి ఏదైనా సినిమా ఒప్పుకునేముందు అందులో శారీర‌క సంబంధం, రొమాంటిక్ సీన్లు ఎక్కువ‌గా ఉన్నాయని తెలిస్తే ముందే ఆ చిత్రం నుంచి త‌ప్పుకుంటాను. అలా ఎన్నో సినిమాలు వ‌దులుకున్నాను. దీని గురించి నేనెప్పుడూ బాధ‌ప‌డలేదు’ అని అభిషేక్ చెప్పాడు. కాగా, అభిషేక్ న‌టించిన‌ ద బిగ్ బుల్, బాబ్ బిస్వాస్‌, లూడో చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఇవేకాకుండా మ‌రో నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్టు అభిషేక్ తెలిపాడు. కాగా, ‘దోస్తానా’ చిత్రంలో జాన్ అబ్రహాంతో లిప్ టు లిప్ కిస్ ఇచ్చే సన్నివేశంలో అభిషేక్ నటించిన విషయాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు లేవనెత్తారు. చేసిందంతా చేసి ఇప్పుడు కలర్ ఇస్తే ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు.