జియో ఆఫర్‌ను లాలీపాప్‌తో పోల్చిన కాంగ్రెస్ లీడర్ - MicTv.in - Telugu News
mictv telugu

జియో ఆఫర్‌ను లాలీపాప్‌తో పోల్చిన కాంగ్రెస్ లీడర్

October 11, 2019

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రిలయన్స్ జియో. అంచానాలకు అందని ఆఫర్లతో యూజర్స్‌ను తమవైపు తిప్పుకుంది. తీరా అన్ని అయిపోయాక అప్పుడు వినియోగదారులపై చార్జీల మోత మెల్లగా ప్రారంభించింది. నాన్ జియో ఔట్‌గోయింగ్ కాల్స్ పై ఇక నుంచి నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సిందేనట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అంతా ఒక్కసారిగా సందిగ్ధంలో పడిపోయారు. దీనిపై విభిన్న రకాలుగా ట్రోలింగ్స్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. 

ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. జియో వినియోగదారులకు చేసిన ఆఫర్‌పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. మీకు ఆఫర్ చేసిన లాలీపాప్ ఎంత పెద్దదైనా.. అది ఎప్పుడూ ఉచితం కాదని గుర్తుంచుకోండి.. ప్రస్తుతం ప్రధాని మోదీ పాలన కూడా అంతే అంటూ ట్వీట్ చేశారు. అటు జియోను, ఇటు మోదీ పాలనను ఏక కాలంలో ఏకిపడేశారు.