21వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు 7 పతకాలు - MicTv.in - Telugu News
mictv telugu

21వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత్‌కు 7 పతకాలు

November 27, 2019

Abhishek Verma-Jyothi Surekha combine claims compound mixed pair gold at Asian Archery Championships

21వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ చివరిరోజున భారత్‌కు పతకాల పంట పండింది. ఈ చాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు 7 పతకాలు గెలుచుకున్నారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో క్రీడలను ముగించారు. బ్యాంకాక్ వేదికగా సాగుతున్న ఈ కాంపౌడ్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో తెలుగు అమ్మాయి ఆర్చర్ జ్యోతి సురేఖ, వెన్నెం అబిషేక్ వర్మ జోడీ బంగారు పతకాన్ని గెలుపొందారు. ఫైనల్లో జ్యోతి సురేఖ వెన్నెం అబిషేక్ వర్మ జోడీ చైనీస్ తైపీ జోడీని 158-151 పాయింట్ల తేడాతో ఓడించింది. 

కాంపౌండ్ టీమ్ విభాగంలో పురుషుల జట్టు కొరియా జట్టు చేతిలో ఓడి రజతంతో వెనుదిరిగింది. మహిళల జట్టు మాత్రం కొరియా చేతిలో పరాజయాన్ని చవిచూసింది. కాగా, భారత ఆర్చరీ సమాఖ్యపై నిషేధం ఉన్న నేపథ్యంలో భారత ఆర్చర్లు స్వతంత్ర క్రీడాకారులుగా టోర్నీలో పాల్గొనడం విశేషం.