Home > Featured > స్కూటీపై 1200 కి.మీ.. కొడుకును తెచ్చుకున్న దివ్యాంగురాలు 

స్కూటీపై 1200 కి.మీ.. కొడుకును తెచ్చుకున్న దివ్యాంగురాలు 

Abled Woman Travelled 1200 Km For Her Son

బిడ్డ కోసం ఓ తల్లి తన వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా సాహసానికి ఒడిగట్టింది. అమరావతిలో చిక్కుకున్న తన కొడుకును ఇంటికి తీసుకువచ్చేందుకు 1200 కిలోమీటర్లు ఒంటరిగా బైక్‌పై వెళ్లి తన ఇంటికి చేరుకుంది. కొడుకు ఒంటరిగా వదిలి ఉండలేక ఎన్నో అవాంతరాలను ఎదురొడ్డి అమ్మ ప్రేమ ఏంటో మరోసారి నిరూపించింది. మహారాష్ట్రలోని పుణె జిల్లా పిప్రీ చించావడ్ ప్రాంతంలో ఇది జరిగింది.

సోను ఖందారే అనే మహిళ కొడుకు ప్రతిక్ లాక్‌డౌన్ కారణంగా అమరావతిలో చిక్కుకున్నాడు. అతన్ని విడిచి ఉండలేక తన స్కూటీని తీసుకొని కొడుకు కోసం బయలుదేరింది. సీసీ కెమెరాలు ఉంటాయనే ధైర్యంతో రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రయాణం చేసినట్టు ఆమె తన ప్రయాణ వివరాలను వెల్లడించారు. బాగా చీకిటి పడిన తర్వాత పెట్రోల్ బంక్‌ల వద్ద నిద్రించి ఉదయాన్నే బైక్‌పై బయలుదేరినట్టు తెలిపారు. ఇలా వెళ్తున్న సమయంలో 4 సార్లు బైక్ టైర్ పంక్చర్ అయినా ఏ మాత్రం నిరాశ చెందకుండా తన కొడుకును చేరుకొని ఇంటికి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఎలాగోలా తన కొడుకును తీసుకువచ్చుకున్న ఆ తల్లి ప్రేమకు అంతా ఫిదా అవుతున్నారు. కాగా గతంలోనూ బోధన్‌కు చెందిన రజియా అనే మహిళ తన కొడుకును తీసుకువచ్చేందు ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే.

Updated : 11 May 2020 4:04 AM GMT
Tags:    
Next Story
Share it
Top