Home > Featured > ఏబీఎన్, టీవీ5 చానెళ్లపై నిషేధం!

ఏబీఎన్, టీవీ5 చానెళ్లపై నిషేధం!

Abn andhra jyothi, tv5 channels banned in andhra pradesh

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో ఏబీఎన్, టీవీ9 చానళ్ళ ప్రసారాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో కాపుల పోరాటం నడిచినప్పుడు ‘సాక్షి’పైనా అనధికారిక నిషేధం కొనసాగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్, టీవీ5 కేబుల్ ఛానెళ్ల ప్రసారాలను అక్కడి ఎంఎస్ఓలు నిలిపేశారు. ప్రభుత్వ ఆదేశాలతోనే ఎంఎస్ఓలు ఈ చానళ్ల ప్రసారాలు నిలిపేసినట్టు ఆంధ్రజ్యోతి పత్రిక ఆరోపించింది. ఏపీలో ఏబీఎన్ చానెల్ ప్రసారాలు ఆగిపోవడం ఇదే తొలిసారి.

ఫ్రీ చానెల్ అయిన ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ని ట్రాయ్ రూల్స్ ప్రకారం ఎలా నిలిపేస్తారని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తోంది. వినియోగదారుడు కోరుకుంటే 72 గంటల్లోగా సర్వీస్ ప్రొవైడర్ ఆ చానెల్‌‌ను అందించాలని ఫ్రీ చానెల్‌ను ఏ కారణంగానూ నిరాకరించొద్దని చెబుతోంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ వర్గాల వాదన మరోలా ఉంది. ప్రతి విషయాన్ని కావాలనే జగన్‌కు అంటగడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సిటీ కేబుల్ వాళ్లకి.. కేబుల్ టీవీ ఎంఎస్ఓలు, డీటీహెచ్ కంపెనీలు, ఫ్రీ చానళ్లు క్యారియర్ ఛార్జీలు కట్టాలి. సిటీ కేబుల్‌కి గత ఐదేళ్లుగా ఏబీఎన్ క్యారియర్ ఛార్జీలు కట్టలేదు. ఛానల్స్ ప్రియారిటీ లిస్టులో 60వ స్థానంలో ఉంచారు. ఛార్జీలు కట్టకున్నా మిగతా చానళ్లతో సమానంగా ప్రాధాన్యం ఇచ్చారుని.. ఇప్పుడు చార్జీలు కట్టనందువల్లే ప్రసారాలు నిలిపేశారని. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.

Updated : 13 Sep 2019 3:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top