సాగు చట్టాల రద్దు అతిపెద్ద తప్పిదం : నిపుణుల కమిటీ సభ్యుడు - MicTv.in - Telugu News
mictv telugu

సాగు చట్టాల రద్దు అతిపెద్ద తప్పిదం : నిపుణుల కమిటీ సభ్యుడు

March 21, 2022

mmm

కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు చాలా మేలు జరిగేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. మూడు చట్టాలకు కేవలం పంజాబ్, ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వ్యతిరేకత వచ్చిందనీ, మిగతా రైతులందరూ స్వాగతించారని పేర్కొన్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడం బీజేపీ చేసిన అతిపెద్ద రాజకీయ తప్పిదమని అనిల్ అభివర్ణించారు. కాగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నేపథ్యంలో సుప్రీంకోర్టు ముగ్గురు నిపుణులతో కూడిన ఓ కమిటీని నియమించింది. సాగు చట్టాల ద్వారా రైతులకు ఒనగూరే ప్రయోజనాలు, నష్టాలు గురించి నివేదిక ఇమ్మని ఆదేశించింది. ఆ కమిటీ సుదీర్ఘ అధ్యయనం తర్వాత కోర్టుకు తన నివేదికను ఇచ్చింది. అందులోని అంశాలు తెలియకున్నా.. కమిటీ సభ్యుడు అనిల్ కొన్ని వివరాలను వెల్లడించారు. చట్టాల రద్దు వల్ల రైతులు ఆదాయం కోల్పోయే అవకాశాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. తాము 73 వ్యవసాయ సంఘాలతో చర్చలు సాగిస్తే, ఏకంగా 65 సంఘాలు చట్టాలకు మద్దతు తెలిపాయని వివరించారు.