కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు

April 13, 2022

apppp

కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో పార్లమెంట్ సభ్యుల (ఎంపీల) ప్రత్యేక సీట్ల కోటాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులను బుధవారం విడుదల చేసింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేబీఎస్ కేటాయిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ కోటాను పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేసింది.

ప్రతి జిల్లాలో క‌నీసం ఒక‌టి చొప్పున కేంద్రీయ విద్యాల‌యాలు తమ కార్య‌క‌లాపాలను సాగిస్తూ వస్తున్నాయి. ప్రతి సంవత్సరం విద్యార్థుల ప్ర‌వేశాల‌కు సంబంధించి, ఎంపీల కోటా కొనసాగింది. ఇకపై ఈ కోటా ఉండదంటూ పూర్తిగా ర‌ద్దు చేసింది.

మరోపక్క కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీల‌కు ఏటా 10 సీట్ల‌ను కేటాయిస్తారు. ఈ సీట్ల‌ను ఎంపీలు త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారి పిల్ల‌ల‌కు కేటాయిస్తూ, లేఖ‌లు జారీ చేస్తారు. మరికొంతమంది ఎంపీలు త‌మ ప‌రిమితికి మించి లేఖ‌లు పంపుతుండేవారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాల‌యాల ప్ర‌వేశాల‌కు సంబంధించి ఎంపీ కోటా సీట్ల భ‌ర్తీ పెను స‌మ‌స్య‌గా మారింది. దీంతో ఎంపీ కోటానే ఎత్తివేస్తూ కేంద్రీయ విద్యాల‌య సంఘ‌ట‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది.