లాక్‌డౌన్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది చనిపోయారంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది చనిపోయారంటే.. 

June 3, 2020

About 200 migrant workers lost lives in road accidents during lockdown: SaveLIFE Foundation

కరోనా వైరస్‌ దేశంలో ప్రవేశించి ఎందరినో పొట్టన పెట్టుకుంది. కొందరిని సోకి, మరికొందరిని సోకకుండానే చంపేసింది. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించగా.. మార్చి 24 నుంచి మే 30వ తేదీ మధ్యలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా 1,461 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 750 మంది మృత్యువాత పడ్డారు. 26.4 శాతం మంది వలస కూలీలు రోడ్డుప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. 5.3 శాతం మంది నిత్యావసర పనులకు వెళ్లి చనిపోయారు. ఈ వివరాలను సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. అయితే నాలుగో దఫా లాక్‌డౌన్‌లో అత్యధికంగా 322 మంది రోడ్డు ప్రమాదాలకు బలయ్యారని చెప్పింది. 

మూడో దఫా లాక్‌డౌన్‌లో సుమారు 60 శాతం మంది వలస కూలీలు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 245 మంది చనిపోగా, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో 56 మంది చొప్పున చనిపోయారు. కాగా, ఈ మరణాలతో పాటు ఆకలి చావులు కూడా సంభవించాయి. అదేవిధంగా శ్రామిక్ రైళ్లలో సంభవించిన 80 మరణాలను, కరోనా రోగుల ఆత్మహత్యలను, లాక్‌డౌన్ వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నవారిని కూడా లెక్కలోకి వేసుకుంటే అసహజ మరణాలు సంఖ్య భారీగానే ఉంది.