About Krishna-Vijayanirmanala Love Story
mictv telugu

ఆవిడ భోజనం అంటే పడి సచ్చేవారు

November 15, 2022

అభిప్రాయాలు వేరు…అభిరుచులు వేరు..అయినా ఇద్దరినీ కలిపింది ఒక్కటే. అదే వారి పరిచయాన్ని ప్రేమగా మార్చింది. ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లింది. తెరపైన కృష్ణ, విజయనిర్మల చూడని చక్కని జంట. రీల్ లైఫ్‌లో వీరి జంట అంటే ప్రేక్షకులకు పండుగ. రియల్ లైఫ్ లోనూ కృష్ణ, విజయనిర్మల ఒక్కటఅయ్యారు. సాక్షితో మొదలైన బంధం…1969లో అగ్నిసాక్షిగా ఒక్కటైంది.

ఆమె చేతి వంటే…

సూపర్ స్టార్ కృష్ణ మంచి భోజనప్రియుడు. విజయనిర్మల సెట్‌కు ఇంటి భోజనాలు తెచ్చేది. ఈ ఇంటిభోజనమే వారిని దగ్గర చేసింది. చికెన్, మటన్ , చేపలపులుసు ప్రత్యేకంగా తెచ్చిపెట్టేవారు. ఇంటినుంచి విజయనిర్మల తెచ్చి వడ్డించిన భోజనంతో కృష్ణకు ఒళ్లు రాలేదు..పొట్ట పెరగలేదట. అందుకే ఆమె తెచ్చే ఫుడ్ అంటే ఇష్టమట. ఇలా పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ తర్వాత వివాహబంధంగా మారింది.

సాక్షితో మొదలైంది

కృష్ణతో తొలిసారిగా సాక్షిలో సినిమాలో విజయనిర్మల నటించారు. ఈసినిమాతో చిత్రకారుడు బాపు డైరెక్టర్‌గా మారారు. 1967లో వచ్చిన ఈ చిత్రంలో కృష్ణ, విజయనిర్మల హీరోహీరోయిన్లుగా నటించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం పులిదిండిలో సాక్షి షూటింగ్ జరిగింది.ఇక్కడ ఆలయంలో శ్రీకృష్ణుడికి మీసాలు ఉంటాయి. పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు..కొత్త దంపతుల గెటప్‌ని ఉద్దేశించి ఈ మీసాల కృష్ణుడు చాలా పవర్ ఫుల్ అని రాజబాబు జోక్ చేశారట.

రెండో వివాహం…

ఎన్నో సినిమాల్లో హీరోహీయిన్లుగా నటించిన కృష్ణ, విజయనిర్మల 1969లో పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. అంతకుముందే కృష్ణమూర్తితో పెళ్లై విజయనిర్మలకు కొడుకు నరేష్ ఉన్నాడు. తెలుగు ప్రేక్షలకు మొదటి నుంచి ఈ జంట అంటే చాలా ఇష్టం. కృష్ణ ఫ్యామిలీ కూడా వీరిద్దరి ప్రేమను అంగీకరించింది. మొత్తానికి మొదటి భార్య ఇందిరాను ఒప్పించారు. కృష్ణ, ఇందిరాల కుమారుడే మహేష్ బాబు. పెళ్లి తర్వాత విజయనిర్మల ఇంట్లోనే వాళ్లు ఉన్నారు. షూటింగ్‌కు వెళ్లే ముందు అత్తమామలకు వంటచేసి వెళ్లేది. ఇదంతా అప్పట్టో విజయ నిర్మల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మీనా నవల ఆధారంగా కృష్ణతో సినిమా తీసింది. ఆ సినిమా విజయవంతంగా నడిచింది.