మళ్లీ మోదీకే పట్టం.. ఏపీ, తెలంగాణల్లో కష్టం - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ మోదీకే పట్టం.. ఏపీ, తెలంగాణల్లో కష్టం

October 4, 2018

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలు మళ్లీ నరేంద్ర మోదీకే ప్రధాని పీఠాన్ని అప్పగిస్తారని ఏబీపీసీ ఓటరు సర్వేలో తేలింది. అయితే బీజేపీకి గత ఎన్నికల్లో భారీ సీట్లు అందించిన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలే వస్తాయని అంచనా వేసింది. ఇక ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ ప్రభావం ఉండదని, అది ఎప్పట్లాగే ఉత్తరాది పార్టీగా మిగిలిపోతేందని లెక్కలు వేసింది.

rr

సర్వే ఫలితాలు

దేశ్ కా మూడ్ పేరుతో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 543 సీట్లకు గాను ఎన్డీయే 276, యూపీఏ 112, ఇతరులు 155 సీట్లు సాధిస్తారు. మోదీ రెండోసారి ప్రధాని అవుతారు. యూపీలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోతుంది. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు 38 శాతం, యూపీఏకు 25 శాతం, ఇతరులకు 37 శాతం ఓట్లు దక్కుతాయి.  యూపీలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్  పొత్తు పెట్టుకుంటే  ఎన్డీఏకు 24 సీట్లు దక్కుతాయి. ఎస్పీ, బీఎస్పీ పొత్తు పెట్టుకుంటే ఏన్డీయేకి 36 వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీకి విజయావకాశాలు లేవు. అన్నింటా కలిపి ఎన్డీయేకు 21, యూపీఏకు 32, ఇతరులకు 76 సీట్లు దక్కుతాయి.  ఏపీలో వైకాపా, టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు లాభపడతాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడి 18 సీట్లు కొట్టేసే చాన్సుంది. ఛత్తీస్ గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ అతి కష్టంతో అధికారాన్ని కాపాడుకునే అవకాశముంది.