ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాని మోదీ..12 గంటల ధ్యానం - MicTv.in - Telugu News
mictv telugu

ఆధ్యాత్మిక యాత్రలో ప్రధాని మోదీ..12 గంటల ధ్యానం

May 19, 2019

సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్‌లో పర్యటించారు. అక్కడ గుహలో 12 గంటల పాటు ధ్యానం కూడా చేయడం జరిగింది. మోదీ పర్యటన ఆదివారం కూడా కొనసాగనుంది.

ఆదివారం మోదీ బద్రీనాథ్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఆధ్యాత్మిక వేషధారణలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్‌ బద్రీనాథ్‌లోని నారాయణుడిని మోదీ దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న భక్తులకు మోదీ అభివాదం చేశారు. అంతకుముందు ఆలయ పూజారులు, అధికారులు మోదీకి ఘనస్వాగతం పలికారు. అయితే మోదీ పర్యటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో మోదీ ఇలా పర్యటించడం అనైతికం అని ఆమె పేర్కొంది.