యువరాజు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి తనకు ఇవ్వలేదని బాధపడ్డ చిన్నారికి మిగతా వారికి దక్కని అరుదైన అవకాశం దక్కింది. అబుదాబి యువరాజుకు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఆ చిన్నారి ఇంటికి వెళ్లి షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తాడు. జాయెద్ ప్రపచంంలో అత్యంత ధనిక యువరాజుల్లో ఆయన ఒకరు. అలాంటి ఆయన తనవద్దకు వచ్చి సర్ప్రైజ్ చేసేసరికి ఆ బాలిక నమ్మలేకపోయింది.
ఇటీవల జాయెద్ ఓ విందులో పాల్గొన్నారు. చాలామంది ఆయనను చూడటానికి, షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి, మాట కలపడానికి బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి కూడా పరుగు పరుగున వచ్చి ఆ లైన్లో నిలబడింది. అతని కరచాలనం కోసం ఎదురు చూసింది. కానీ, ఆ చిన్నారి ఆశ నెరవేరలేదు. యువరాజు అందరితో చిరునవ్వుతో కరచాలనం చేసి , ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ చిన్నారి నొచ్చుకుంది. అయితే అది కావాలని చేసింది కాదు. ఆ పాపను యువరాజు చూడలేదు అంతే.
اجمل مقطع ممكن تشوفه اليوم ❤❤❤👑#اليوم_الوطني_الاماراتي_48 pic.twitter.com/C3cqLUTib4
— سَ 🎶 (@7XFIl) December 2, 2019
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో బాలిక తీవ్ర నిరాశకు గురవడం స్పష్టంగా కనిపించింది. యువరాజు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని ఎంతో బాధపడింది. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లారు. ఆ చిన్నారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టారు. దీంతో బాలిక ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మనసున్న మారాజు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.