14 మంది రూ. 1.30 కోట్ల తిండి తిన్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

14 మంది రూ. 1.30 కోట్ల తిండి తిన్నారు..

November 21, 2022

ఫ్యామిలీతో కలిసి రెస్టారెంటుకు వెళ్తే ఎంత బిల్లవుతుంది. మహా అయితే రెండు మూడువేలు. ఎంత లగ్జరీ ఫుడ్ అయినా ఓ ఐదువేలు. ఓ పదిమంది ఫ్రెండ్స్‌తో కలసి వెళ్తే కొంచెం ఎక్కువ. పద్నాలుగు మందితో కలసి వెళ్తే పదివేలో, ఇరవై వేలో. ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత ఎంజాయ్ చేసినా పోనీ ఓ లక్ష. అంతకు మించదు. కానీ అక్కడ అక్షరాలా 14 మంది ఓ పూట తిండి కోసం రూ. 1.30 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఒక్కొక్కరు సగటులు రూ. 10 లక్షల తిండి తిన్నారు. అంత బిల్లు అంటే తిండి మామూలుగా ఉండదు కదా.
మాంసం, చికెన్, రొయ్యలు, నాన్ వంటివన్నీ మెనూలో ఉన్నాయి. ఖరీదైన నూనెలు, మసాలాలు దట్టించి వండారు.

మటన్ స్టీక్స్‌కు 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ఫాయిల్ కలిపి వడ్డించారు. నంజుకోవడానికి మరెన్నో ఖరీదైన ఐటమ్స్. అందుకే బిల్లు వాచిపోయింది. డబ్బున్నోళ్లకు అది లెక్కే కాదుకదా. అబు ధాబిలోని నసర్ ఎట్ రెస్టారెంటులో బడాబాబులు ఈ తిండితిన్నారు. హోటల్ యాజమాన్యం బిల్లును, బంగారం రేకు అంటించిన స్టీక్ ఫొటోలను సోషల్ మీడియో పెట్టడంతో విషయం కాస్తా బయటికిపొక్కింది. ఫార్ములా వన్, ఫుట్‌బాల్ వరల్డ్ కప్ పోటీలు చూడ్డానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, కుబేరులు అక్కడికి పోటెత్తుతున్నారు. టర్కీకి చెందిన చెఫ్ నస్రత్ గోకే పలు దేశాల్లో నసర ఎట్ పేరుతో ఖరీదైన హోటళ్లు నడుతున్నారు.