ఏబీవీపీ విద్యార్థులను వెళ్లగొట్టిన ఎమ్మెల్యే - MicTv.in - Telugu News
mictv telugu

ఏబీవీపీ విద్యార్థులను వెళ్లగొట్టిన ఎమ్మెల్యే

December 5, 2017

ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ విద్యార్థి మురళి ఆత్మహత్యకు నిరసనగా బీజీపీ మంగళవారం పిలుపునిచ్చిన తెలంగాణ బంద్‌కు మిశ్రమస్పందన లభించింది. చాలా విద్యాసంస్థలు యథాప్రకారం పనిచేశాయి. ఏబీవీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల స్కూళ్లను బలవంతంగా మూయించారు.

బంద్‌లో భాగంగా పెద్దపల్లిలోని ట్రినిటీ విద్యాసంస్థలను మూయించాడనికి వెళ్లిన బీజేపీ కార్యకర్తలకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ మనోహర్ రెడ్డి.. ఏబీవీపీ కార్యకర్తలను దగ్గరుండి మరీ బలప్రయోగం చేసి బయటికి పంపించారు.  పెద్దపల్లి ఏబీవీపీ భాగ్ కోకన్వీనర్ అక్కపల్లి సంపత్‌ను భుజం పట్టుకుని తోసేసి అక్కడి నుంచి పంపించారు. దీనిపై ఏబీవీవీ, బీజేపీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.