మహిళా ఎస్ఐపై ఖాకీచకం..! - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా ఎస్ఐపై ఖాకీచకం..!

September 6, 2017

సామాన్య పౌరులకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు భక్షుకులుగా మారుతున్నారు. లాకప్ మరణాలు, పోలీస్ స్టేషన్లలోనే అత్యాచారాలు, బలవంతపు వసూళ్లు, పంచాయతీలు, నేరగాళ్లకు కొమ్ములు కాకడాలు.. ఇవన్నీ మనకు తెలిసినవే. అయితే తమిళనాడులో ఖాకీ ఉన్నతాధికారి ఏకంగా ఓ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్పైనే  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అదీ పట్టపగలు అందరూ చూస్తుండగానే.

నీట్ పరీక్షను సుప్రీం కోర్టు సవాలు చేసిన అనిత ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. దీనిపై విద్యార్థులు కోయంబత్తూరు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వాళ్లను అదుపు చేయడానికి పోలీసు అక్కడికి వెళ్లారు. గొడవ మధ్య  జయరాం అనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ పక్కనే ఉన్న మహిళా ఎస్ఐ చాతీపై చేయివేసి అదుముతూ కనిపించాడు. ఆమె ప్రతిఘటించి చేయిని విసిరికొడుతున్నా ఆపకుండా  పదేపదే చేతులేశాడు. జనం గుంపులో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. అయితే ఈ దృశ్యాలు సీసీ కెమరాల్లో నమోదయ్యాయి. దీనిపై విలేకర్లు వివరణ కోరగా.. అసలు తన ముందు మహిళలు ఉన్నారనే విషయమే తనకు తెలియని బొంకాడు. తమిళనాడు ప్రభుత్వం ఈ కామాంధుణ్ని ఏం చేస్తుందో మరి.