ఏసీని ఎలా మెయింటైన్ చేయాలో తెలసుకోండిలా - MicTv.in - Telugu News
mictv telugu

ఏసీని ఎలా మెయింటైన్ చేయాలో తెలసుకోండిలా

May 10, 2022

వేసవి ప్రారంభం అయిందంటే కార్యాలయాల్లో, ఇళ్లల్లో ఏసీల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు సంపన్నులు మాత్రమే వినియోగించే ఏసీలను ఈ మధ్య కాలంలో మధ్యతరగతి ప్రజలు కూడా వాడడం మొదలుపెట్టారు. అయితే చాలా మందికి ఏసీని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. చాలా వరకు ఇతరులపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో ఏసీని మంచిగా, నాలుగు కాలాలు మన్నేటట్టు ఎలా వాడాలో తెలుసుకుందాం.

1. తక్కువలో ఏసీ టెంపరేచర్
ఏసీలో ఉష్ణోగ్రత ఎంత తగ్గిస్తే అంత తొందరగా గది చల్లబడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, స్టాండర్స్ ప్రకారం మన శరీరానికి కావాల్సిన 24 డిగ్రీల వద్ద ఏసీని ఉంచడం ఉత్తమం. అందుకు ఏసీలో 24 డిగ్రీల వద్ద డిఫాల్టుగా ఉంటుంది.

2. సీలింగ్ ఫ్యాన్
ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. తక్కువ స్పీడులో పెట్టుకుంటే గది మొత్తం ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. స్పీడు పెంచితే ఏసీ ద్వారా వచ్చిన చల్లదనం తొందరగా బయటకు వెళ్లిపోతుంది.

3. అవుడ్ డోర్ యూనిట్
ఏసీ యొక్క అవుట్ డోర్ యూనిట్‌ను ఎండ తగిలే ప్రదేశంలో కాకుండా, కాస్త నీడ తగిలేలా చూసుకోవాలి. దీని ద్వారా ఏసీ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. అధిక వేడి నుంచి తప్పించుకొని మరింత కాలం మన్నికగా పనిచేస్తుంది.

4. ఎనర్జీ ఎఫీషియెన్సీ రేషియో
ఎనర్జీ ఎఫీషియెన్సీ రేషియో (ఐసీఆర్) మార్కు ఏసీపై ఉంటుంది. ఎంత విద్యుత్ వాడుకొని ఎంత వేడిని బయటకు పంపుతుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఐసీఆర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేడిని తొలగించి ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుందని అర్ధం. ఏసీ ఎంత బరువు ఉంటుందో దాన్ని బట్టి కూడా ఇది మారుతుంటుంది. కాకపోతే సమయం గడుస్తున్న కొద్దీ 5 స్టార్ ఏసీ 4 లేదా 3 స్టార్స్‌కు మారిపోతుంటుంది.

5. గదిలో మనుషుల సంఖ్య
గదిలో మొత్తం ఎంతమంది ఉన్నారు? గది విస్తీర్ణం ఎంత? ఏసీ ఎంత బరువుంది? వంటివాటిని బట్టి చల్లదనం, కరెంటు బిల్లు ఆధారపడి ఉంటాయి.
6. ఏసీ ఫిల్టర్ శుభ్రత
మనలో చాలా మంది ఒకసారి ఏసీ ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ, ఇది కరెక్టు కాదు. వారానికి ఒకసారి ఏసీ పై భాగంలో ఉంగే ఫిల్టర్‌ను క్లీన్ చేసుకోవాలి. లేదంటే చల్లదనానికి ఎక్కువ టైం తీసుకోవడంతో పాటు విద్యుత్ బిల్లు కూడా ఎక్కువొస్తుంది. ఫిల్టర్ శుభ్రంగా ఉండడం వల్ల వేడి గాలి సులువుగా బయటకు వెళ్తుంది.

7. స్టెబిలైజర్
స్టెబిలైజర్ ఫ్రీ ఏసీ అని ఈ మధ్య కొత్త రకాలు వచ్చాయి. అంతమాత్రాన స్టెబిలైజర్ అనవసరం అని అనుకోవద్దు. మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎలా ఉందో ముందు తెలుసుకోవాలి. విద్యుత్ వోల్టేజీలో మరీ హెచ్చుతగ్గులుంటే స్టెబిలైజర్ తీసుకోవడం ఉత్తమం.

8. రిమోట్ ద్వారా ఆన్, ఆఫ్ చేయడం
చాలా మంది చేసే మరో తప్పు ఏంటంటే ఏసీని రిమోట్‌తో ఆన్, ఆఫ్ చేయడం. డిగ్రీలను రిమోట్‌తోటి సెట్ చేయవచ్చు గానీ, ఆన్, ఆఫ్ మాత్రం రిమోట్‌తో చేయకూడదు. దీని వల్ల విద్యుత్ బిల్లు భారం పెరుగుతుంది.

9. సర్వీసింగ్
ఏసీని ప్రతీ ఏడాది ఒకసారి తప్పనిసరిగా సర్వీసింగ్ చేయించడం వల్ల శుభ్రమవడంతో పాటు పనితీరు మెరుగ్గా ఉండి కరెంటు వినియోగం తగ్గుతుంది.