వామ్మో.. ఎస్ఐ అక్రమ సంపాదన రూ. 8 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో.. ఎస్ఐ అక్రమ సంపాదన రూ. 8 కోట్లు

October 3, 2019

ACB Conduct Raids On Motor Vehicle Inspector And His Relatives

కర్నూలు జిల్లా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్నూలు, తాడిపత్రి సహా హైదరాబాద్‌, బెంగళూరులోని రెండు ప్రాంతాలలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు రూ.8 కోట్లు విలువ చేసే అక్రమ సంపాదన వున్నట్టు తెలుస్తోంది. కర్నూలులోని ఇంట్లో కేజీకి పైగా బంగారాన్ని అధికారులు గుర్తించారు. బెంగళూరులో జీ ప్లస్ 7 అపార్ట్‌మెంట్‌తో పాటు హైదరాబాద్‌లో మరో బిల్డింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య అనిశా పేరుమీద రెండు సూట్‌కేసు కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా యుగాండా దేశంలో బ్యాంకు అకౌంట్, హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో లాకర్‌ ఉన్నట్లు అధికారులు తేల్చారు. సోదాలు మరునాడు కూడా కొనసాగే అవకాశం వున్నట్టు సమాచారం.