చంచల్ గూడ జైలుకు మాజీ ఎమ్మార్వో లావణ్య - MicTv.in - Telugu News
mictv telugu

చంచల్ గూడ జైలుకు మాజీ ఎమ్మార్వో లావణ్య

September 24, 2019

Acb court sent mro lavanya to chanchalguda jail

లంచాలు గించాలు తీసుకోకుండా చక్కగా పనిచేస్తుందని ఆమెకు రెండేళ్ల కిందట ఉత్తమ ఎమ్మార్వో అవార్డు ఇచ్చారు. కానీ ‘ఉత్తమ’ పొరల కింద దాగిన లంచావతారాన్ని గుర్తించలేదు. ఓ రైతుతో డీల్ విషయంలో అమ్మగారి బండారం బయటి పడింది. లంచం కేసులో రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎమ్మార్వో లావణ్యను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

లావణ్య నివాసాల్లో చేసిన తనిఖీలో భారీ అక్రమాస్తులు వెలుగు చూశాయి. హయత్‌నగర్‌లోని ఆమె ఇంట్లో రూ.93 లక్షల నగదు, 40 తులాలకు పైగా బంగారం, కొన్ని స్థలాలు, ఆస్తుల డాక్యుమెంట్లు దొరికాయి. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తరువాత ఆమె బెయిల్‌పై విబయటికి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం లావణ్యను మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈరోజు హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. విచారణ తరువాత ఆమెను అధికారులు చంచల్ గూడ మహిళా జైలుకి తరలించారు. లావణ్య ఇటీవల బెయిల్‌పై బయటికి వచ్చింది.