Accenture fires employees with fake experience letters
mictv telugu

ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో జాబ్స్.. భారీగా ఉద్యోగుల తొలగింపు

November 9, 2022

ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ తన ఉద్యోగులకు గట్టి షాక్ ఇచ్చింది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ లెటర్స్‌తో తమ కంపెనీలో జాబ్ సంపాందించిన వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఫేక్ డాక్యుమెంట్లతో కంపెనీలోకి ఎంప్లాయ్‌గా ఎంటర్ అవ్వడం.. నిబంధనలు ఉల్లంఘించడమేనని, ఇది తమ కంపెనీని మోసం చేయడమేనని చెప్పింది. తాము కొన్ని నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటామని, ఇలా జాబ్ సంపాదించిన వారిని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఉద్యోగుల వల్ల తమ క్లయింట్‌లకు నష్టం జరిగే ప్రమాదం ఉందని, అందుకే వారిని తొలగించామని సంస్థ వెల్లడించింది.

కరోనా సమయంలో ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సి వచ్చిందని.. వారిలో చాలా మంది ఇలా ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా వచ్చారని.. ఇప్పుడు HRలు వారి క్రెడెన్షియల్స్ చెక్ చేసే పనిలో పడ్డారని వివరించింది. కొంత కాలంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా వంటి కంపెనీలు కోట్లాది రూపాయలు నష్టపోయాయి. ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. ఇది భారత్‌పైనా ప్రభావం చూపిస్తోంది. ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.