ఉద్యోగం మానేస్తే 7  నెలల జీతం.. యాక్సెంచర్! - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగం మానేస్తే 7  నెలల జీతం.. యాక్సెంచర్!

September 26, 2020

Accenture offers 7-month severance payout to staff

అంతర్జాతీయ ఐటీ సంస్థ యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులలో ఐదు శాతం మందిని తొలగించి ఉద్యోగులకు కరోనా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 5.13 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. మన దేశంలో 10 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలో యాక్సెంచర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.  తమ సంస్థలో స్వచ్చందంగా ఉద్యోగాలు వదులుకునే వారికి 7 నెలల వేతనాలు చెల్లించాలని యాక్సెంచర్ నిర్ణయించింది. ఏడు నెలల్లో ముడు నెలల కాలాన్ని నోటీస్‌ పిరియడ్‌గా పేర్కొని, మరో నాలుగు నెలలు వేతనాలను చెల్లించనుంది. అయితే మెజారిటీ ఐటీ కంపెనీలు ఉద్యోగాలు వదులుకున్న వారికి రెండు నుంచి మూడు నెలల మాత్రమే వేతానాలు చెల్లిస్తున్నాయి.

కాగా, యాక్సెంచర్ సంస్థ ప్రతి సంవత్సరం కొత్త ఉద్యోగాలు, ఉద్యోగాల కోత సహజమేనని పేర్కొంది. అయితే ఎక్కువగా టెక్నాలజీకి డిమాండ్‌ లేని ప్రాంతాలలో ఉద్యోగాల కోత ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది. మరోవైపు టెక్నాలజీకి డిమాండ్‌ ఉన్న ప్రాంతాలలో కంపెనీలు కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. యాక్సెంచర్ సంస్థకు ఇప్పటికి 70 శాతం రెవెన్యూ డిజిటల్‌ సేవల నుంచి లభిస్తున్నాయి. ఇందులో హెడ్ కౌంట్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయని యాక్సెంచర్ సీఈవో జూలీ స్వీట్ తెలిపారు.