ఫేక్ లెటర్లతో జాబ్ సాధించిన వేల మందిని తొలగించిన ఐటీ సంస్థ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేక్ లెటర్లతో జాబ్ సాధించిన వేల మందిని తొలగించిన ఐటీ సంస్థ

November 6, 2022

ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత ఐటీ రంగం సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. దీన్ని తట్టుకోవడంలో భాగంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. యాపిల్, గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. ఈ సంస్కృతి ఇప్పుడు మనదేశానికి కూడా పాకింది. ఈ నేపథ్యంలో దిగ్గజ్ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఇండియా యూనిట్ వేల మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది.

వీరిలో చాలా మంది ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లతో దొడ్డి దారిన ఉద్యోగాలు పొందారని, అలాంటి వారిని కనిపెట్టి ఉద్వాసన పలికినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ సంఖ్య ఎంతన్నది చెప్పలేదు కానీ, వేలల్లో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని కంపెనీ మీడియా ముఖంగా అంగీకరించింది. తమ క్లయింట్లకు అందించే సేవలలో నాణ్యత తగ్గకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే ఫేక్ సర్టిఫికెట్లపై స్పందించింది. తాము సిద్ధాంతాలు పాటిస్తామని, సరైన అర్హతలు ఉన్నవారినే నియమించుకుంటామని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారు కంపెనీని మోసం చేసినట్టేనని తేల్చి చెప్పింది. కరోనా సమయంలో ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో జాయిన అయిన వారి క్రెడెన్షియల్స్ చెక్ చేసే పనిలో హెచ్ ఆర్ డిపార్టుమెంటు వాళ్లు ఉన్నారని వివరించింది.