ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అనంత లోకాలకు ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆంధ్రప్రదేశ్ కు వచ్చి అనంత లోకాలకు ..!

August 5, 2017

ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం నుండి పాండిచ్చేరికి వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జర్గింది. మదనపల్లి మండలం పుంగనూరు దగ్గర యాతాల వంకకాడ సమీపంలో టెంపో, కంటైనర్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఐదుగురు స్పెయిన్ దేశస్తులు చనిపోయారు.నలుగురు అక్కడికక్కడే చనిపోగా…ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లలా దగ్గరలో ఈ ప్రమాదం జర్గింది.వీళ్లు అనంతపురంలో ఉన్న రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ కు వచ్చారు. అక్కడి నుంచి పాండిచ్చేరికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారు మదనపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.