కామారెడ్డిలో ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్ - MicTv.in - Telugu News
mictv telugu

కామారెడ్డిలో ప్రమాదం.. ఐదుగురు స్పాట్‌డెడ్

March 28, 2022

03

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మాచారెడ్డి మండలం ఘనప్పూర్(ఎం) గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, ఓ చిన్నారికి తీవ్ర గాయాలైనట్ల అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో విషయం తెలుకున్న పోలీసులు ఘటన స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

03

ఈ నేపథ్యంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ”కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్పారు. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నాం” అని తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆషుప్రతికి తరలించారు.గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.