ప్రమాదం నుంచి తప్పించుకున్న సత్యవతి రాథోడ్... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రమాదం నుంచి తప్పించుకున్న సత్యవతి రాథోడ్…

May 5, 2022

తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ మున్సిప‌ల్ కేంద్రానికి స‌మీపంలో కాన్వాయ్‌కు ఓ పంది అడ్డురావ‌డం.. ఇంత‌లో డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేయ‌డంతో మంత్రి కాన్వాయ్‌లో ఒక కారు ప్రమాదానికి లోనైంది. అయితే అదృష్టవశాత్తు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌కు ఏం జరుగలేదు. మంత్రి హైదరాబాద్ నుంచి మ‌హ‌బూబాబాద్ వెళ్తుండ‌గా ఈ ఘటన చోటుచేసుకుంది.

మంత్రి కాన్వాయ్.. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కార్గిల్ సెంటర్ సమీపంలో రాగానే ఓ పంది అడ్డు రావటంతో డ్రైవ‌ర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న మరో వాహనం వేగంగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గన్ మేన్ ల‌కు స్వల్ప గాయాలు కాగా.. మంత్రి సత్యవతి సురక్షితంగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని వాహనాలను క్లియర్ చేశారు.