తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూప్ వాహనం కీసర సమీపంలో చిన్న ప్రమాదానికి గురైంది. బుధవారం ఆయన శామీర్‌పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా ఔటర్ రింగ్‌రోడ్డుపై మంత్రి వాహనాన్ని వెనకవైపు నుంచి ఓ లారీ ఢీకొంది. తలసాని వాహనంలో ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. తలసాని సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిని సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.