నిజంగా మనుషులుగా పుట్టినందుకు ఆనందిద్దాం, మన మససులు రాయికంటే గట్టిగా తయారైనందుకు గర్వపడదాం. పక్కోడు చావు బతుకుల్లో ఉంటే మనకేంది, వాళ్లేమైపోతే మనకేంది. పోయే ప్రాణాలు ఎలాగో పోతాయి మనకెందుకు కదా. బతికేద్దాం ఎలాగోలా బతికేద్దాం, అభివృద్ధిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్దాం, దయ, జాలి ,కరుణ, మానవత్వం ఇలాంటి వన్నింటిని పాతాళంలో పాతి పెడదాం. బుద్ది,జానం ఉన్న మనషులం కదా..మానవత్వం, మన్ను మశాడం అంటూ కూర్చుంటే మనకేమస్తది చెప్పున్రి. చండీగడ్ లో ఉన్న కొందరి మనుషులను ఆదర్శంగ తీస్కుందాం. ఇంతకీ వాళ్లేం జేశిన్రో తెల్వాలే కదా…
చండీగర్ లో అమన్ దీప్ (25) అనే యువతి స్కూటీ పై వెళ్తుంది. సరిగ్గా అప్పుడే వేగంగా వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టింది. చుట్టూ జనం గుమిగూడారు. వెంటనే తమ మొబైల్స్ కు పని జెప్పారు. ఏమిటీ ఆంబులెన్స్ కు ఫోన్ చెయ్యడానికి అన్కునెరు, కాదు ఫోటోలు ,వీడియోలు తీయడానికి. 45 నిమిషాల పాటు ఆ యువతి ప్లీజ్ నన్ను బతికించండి, అని ప్రాధేయ పడింది, అయినా లాభం లేక పోయింది. చివరకు యద్విందర్ సింగ్ అనే ఆమె బంధువు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించాడు. హాస్పిటల్ లోకి వెళ్తున్న ఆ యువతి ‘నేను మా నాన్నతో మాట్లాడాలి, ఒకసారి దయచేసి ఆయనకు ఫోన్ చేయండి. నన్ను చూసిన వాళ్లంతా ఆస్పత్రికి తీసుకెళ్లడం మానేసి ఫొటోలు వీడియోలు తీసుకుంటూ వెళ్లిపోయారు’ అని చెప్పింది, అంతలోనే పాపం ఆమె ప్రాణం పోయింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు రొటీన్ డైలాగ్ కొంచెం ముందస్తే బతికేదని. ఆమెకు ఈమధ్యే అమన్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం అయ్యిందట. ఈ నెల 13 పెళ్లి కూడా పెట్టుకున్నారట. కానీ జనం నిర్లక్ష్యంతో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె పాడె ఎక్కాల్సిన పరిస్ధితి. కానీ ఓదిక్కు ప్రాణం పోతున్నా ఫోటోలు, వీడియోలు తీసీన 45 నిమిషాలు వేడుక చూసిన అక్కడి జనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఒకవేళ వాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఆ పరిస్ధితుల్లో ఉంటే అలాగే ఫోటోలు తీస్తారేమో…ఎందుకంటే రాను రాను పెరుగుతున్న టెక్నాలజీ, అభివృద్ది ముందు బంధాలు ,అనుభందాలు ఏంటియ్ సిల్లీ కాకపోతే …ఆ సమయంలో అక్కడున్న జనానికి నిజంగా హాట్సాఫ్ చెయ్యాల్సిందే.