సాధారణంగా ఏడాదికి 12 నెలలుంటాయని మనందరికి తెలిసిందే. అయితే అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం వస్తుంది. అయితే వచ్చే ఏడాది ఓ మాసం అధికంగా వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం 2023లో 13 నెలలు ఉండనున్నాయి. అందులో శ్రావణ మాసం రెండు సార్లు రాబోతోంది. ఇలా 19 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. దీన్ని అధిక మాసం అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే వచ్చే ఏడాది జులై 18 నుంచి ఆగస్ట్ 16 వరకు అధిక శ్రావణ మాసం ఉండనుంది. ఇలా రావడానికి కారణం క్యాలెండర్ లెక్కింపులో ఉన్న తేడాలే. సౌరమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తే ఏడాదికి 365 రోజుల 6 గంటలు ఉంటాయి. అదే చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే తేడాలను ఇలా అధికమాసం రూపంలో సరి చేస్తుంటారు. దీన్ని ఇంగ్లీష్ క్యాలెండర్ కి ఆపాదించి చూస్తే కనుక.. ఉదాహరణకు జనవరికి 31 రోజులు ఉంటాయి. కానీ ఫిబ్రవరి మాత్రం 28 రోజులు నాలుగేళ్లకు లీపు సంవత్సరం పేరుతో 29 రోజులు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక నెలలో 31 రోజులు వస్తే తర్వాతి నెలలో 30 రోజులు ఉండాలి. కానీ, జులై, ఆగస్టు వరుస నెలలలో 31 రోజులు ఉంటాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఈ విధంగా సర్దుబాటు చేసే ఏర్పాటు ఉంది. అలాగే హిందూ పంచాంగం ప్రకారం అధిక మాసం (కొందరు శూన్య మాసం అని కూడా అంటారు) వస్తుంది. ఇదంతా కాలాన్ని సరిచేయడానికి ఉన్న సౌలభ్యాలు.
ఇవి కూడా చదవండి