Accused of cheating on minor sisters in the name of love
mictv telugu

హైదరాబాదులో మరో దారుణం.. మైనర్ అక్కాచెల్లెళ్లపై రెండేళ్లుగా అఘాయిత్యం

June 9, 2022

Accused of cheating on minor sisters in the name of love

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరం హైదరాబాదులో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. మొన్న జూబ్లీహిల్స్, నిన్న కార్ఖానా, ఈ రోజు సికింద్రాబాద్ అంటూ నగరంలో వరుస అఘాయిత్యాలు నమోదవుతున్నాయి. సికింద్రాబాదుకు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నారు. ఫేస్ బుక్ ద్వారా మైనర్ యువతులను లోబరుచుకున్న నిందితులు నవాజ్ (21), ఇంతియాజ్ (21) వారిని ప్రేమ పేరుతో వంచించారు. విషయం తెలుసుకున్న బాలికల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అంబర్ పేటకు చెందిన వారిగా గుర్తించారు. కాగా, జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు నిందితుల్లో ఒకరు మేజర్ అయితే మిగతా నలుగురు మైనర్లు. మైనర్లని మేజర్లుగా పరిగణించి విచారణకు అనుమతించాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ విషయాన్ని సీవీ ఆనంద్ ధృవీకరించారు. మరి కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.